మృత్యుశకటం.. | Three killed in lorry collided | Sakshi
Sakshi News home page

మృత్యుశకటం..

Nov 21 2015 8:32 AM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

- బాలికలపైకి దూసుకెళ్లిన లారీ
- ముగ్గురు చిన్నారులు మృతి

కొలిమిగుండ్ల
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్న ముగ్గురు బాలికలపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో మణి (12), రాజేశ్వరి (16), తిరుపతమ్మ (14 ) తీవ్ర గాయాలతో మృతి చెందారు. బాలికలను ఢీకొట్టిన లారీ అదే వేగంతో 100 అడుగుల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొలిమిగుండ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement