తిరుపతిలో మూడురోజుల పండుగ | This three-day festival in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో మూడురోజుల పండుగ

Jan 14 2016 1:51 AM | Updated on Jul 28 2018 3:23 PM

తిరుపతి నగరంలో మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించనున్నారు.

మారససరోవరం, శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు
హాజరుకానున్న ముఖ్యమంత్రి
 

తిరుపతి నగరంలో మూడు రోజుల పాటు  సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు.  
 
తిరుపతి: నగరంలో మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. తుడా కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  జిల్లాలో ఆటపాటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. సంస్కృతి, సంప్రదాయలను గుర్తుపెట్టుకుని మంచి మనస్సుతో అందరూ భాగస్వాములై సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకోవాలని కోరారు. ఈ వేడుకలు మరింత ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ప్రైవేటు భాగస్వామ్యంలో  మానస సరోవర్, శిల్పారామంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతిలోని స్టార్‌హోటళ్ల యజమానులంతా సహకరించి శిల్పారామంలో స్టాల్స్ పెట్టాలని కోరారు. తిరుపతి నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేంతుకు లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రకాల వంటకాలు, నిత్యవసర వస్తువుల్లో కల్తీలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లను అలెర్ట్ చేసి వీటిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో జరగబోయే నంది నాటకోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

కళాకారులను తీసుకొని వచ్చి మరిచిపోతున్న సంప్రదాయాలను మళ్లీ గుర్తుచేసేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మున్సిపల్ గ్రౌండ్‌లో గాలిపటాల పోటీలు, శిల్పారామంలో పశువుల పండుగ, కోడిపందాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  పండుగ కళ ఉట్టుపడేలా స్వాగత తోరణాలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డెరైక్టర్ ఆఫ్ కల్చరల్ విజయభాస్కర్ పాల్గొన్నారు. అనంతరం తుడా కార్యాలయంలో ఏర్పాట్లపై టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అధికారులు చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement