ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆలయ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.
- 1.30 లక్షల మందికి వర్తింపు
- కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దేవాదాయ శాఖ
తిరుపతి(చిత్తూరు జిల్లా)
ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆలయ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆదివారం ప్రకృతి వ్యవసాయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1.30 లక్షల మందికి ఐదు మార్గాల ద్వారా రాష్ట్రంలోని ఆలయాలను దర్శించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి భోజనం, వసతి, వాహన సదుపాయం ఉచితంగా ఏర్పాటుచేస్తామన్నారు. ఐదు రూట్లుగా విభజించి ఆలయాల దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు.