యువత తలచుకుంటే దేశ భవిష్యత్తునే మార్చగలరని జిల్లా కలెక్టర్ కే.రామ్‌గోపాల్ అభిప్రాయపడ్డారు.
=కళల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి
=సెట్విన్ కృషి ప్రశంసనీయం
=యువజనోత్సవాల్లో కలెక్టర్ రామ్‌గోపాల్
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: యువత తలచుకుంటే దేశ భవిష్యత్తునే మార్చగలరని జిల్లా కలెక్టర్ కే.రామ్‌గోపాల్ అభిప్రాయపడ్డారు. యువజన సర్వీసుల శాఖ (సెట్విన్) జిల్లా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే యువజనోత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎస్వీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన మొదటి రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతీ, యువకుల్లో దాగివున్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసే దిశగా సెట్విన్ అధికారులు చేస్తు న్న కృషి ప్రశంసనీ యమన్నారు. కళల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం తీసుకువచ్చే మార్పులో కూడా యువతదే కీలకపాత్ర అవుతోందన్నారు. అందుకోసం వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణ, అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి జనాభా ప్రకారం 35 ఏళ్ల లోపు వయసున్నవారు 65 శాతం ఉండడం దేశ అభివృద్ధికి నిదర్శనమన్నారు.
ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒక రు భారతీయుడుగా ఉండడం దేశానికి గర్వకారణమన్నారు. ఎదుటి వ్యక్తిని గౌరవించే విధం గా విద్యా వ్యవస్థ అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఎలాంటి ఉద్యోగా న్ని ఎంచుకున్నా లక్ష్యసాధన దిశగా పయనిం చాలన్నారు. అప్పుడే వ్యక్తిగత, మానసిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలి పారు. 20 ఏళ్ల క్రితం వృద్ధాశ్రమాలు కనబడేవి కావని, ఇప్పు డు ఎక్కడ చూసినా ఆశ్రమాలు కనబడుతుం డడం బాధాకరమన్నారు.
అందుకు ఎన్నో కారణాలున్నప్పటికీ యువత పెడదోవ పట్టకుండా సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సెట్విన్ సీఈవో బీ.లావణ్యవేణి మాట్లాడుతూ యువతలో సామాజిక స్పృహ, కళల పట్ల ఆసక్తిపెంచేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నామన్నా రు. అందులో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారికి తిరుపతిలో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపా రు.
ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ర్టస్థా యి పోటీలకు పంపుతామన్నారు. మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావతి మాట్లాడుతూ కళ ల పట్ల ఆసక్తి వున్న యువతకు తమ కాలేజీ తరఫున అన్నివిధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 350 మంది యువ కళాకారులు సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నా రు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిశా వంటి సంప్రదాయ నృత్యాలు, జానపద బృందాల నృత్యాలు, సంగీత పోటీలు నిర్వహించారు. అలాగే వాయిద్య పరికరాలైన తబలా, ఫ్లూట్, మృదంగాల్లో పోటీలు నిర్వహించారు.