పార్వతీపురం: ప్రశాంతతకు మారుపేరైన బొబ్బిలిలో సినీ ఫక్కీలో కిడ్నాప్, దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం పార్వతీపురంలో వెలుగులోకి వచ్చింది.
పార్వతీపురం: ప్రశాంతతకు మారుపేరైన బొబ్బిలిలో సినీ ఫక్కీలో కిడ్నాప్, దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం పార్వతీపురంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పార్వతీపురం టౌన్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్, బాధితుడు కనకల గణేశ్వరరావు అందించిర వివరాలు... బొబ్బిలికి చెందిన సెవెన్ సోల్స్ అనే స్వచ్ఛంద సంస్థ పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఏపీటీడబ్ల్యు రెసిడెన్షియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 23 నుంచి జూలై 15 వ రకు మెడికల్ క్యాంపు నిర్వహించింది.
ఈ నెల 5న ఆ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కనకల గణేశ్వరరావుకు ఆ మెడికల్ క్యాంపు నిర్వాహకులు ఫోన్ చేసి ఏవో కబర్లు చెప్పి తమ వద్దకు రమ్మని కారు పంపించారు. దీంతో వారు పంపించిన కారులో ప్రిన్సిపాల్ గణేశ్వరరావు ఈ నెల 5న బొబ్బిలి వెళ్లారు. అయితే అక్కడ వాళ్లు ప్రిన్సిపాల్‌ను కిడ్నాప్ చేసి, ఫ్లై-ఓవర్‌కు దగ్గరలోని ఓ పాడుబడిన ఇంట్లో బంధించారు. మరుసటి రోజు ఆరువ తేదీన వెంకటేశ్వరరావు, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనను చావ బాదారు. తమను సలోమీ అనే ఆమె పంపిందని, తాము కొట్టినట్టు ఎవరికైనా చెబితే కుటుంబాన్నీ చంపేస్తామని బెదిరించి ఆయన వద్ద ఉన్న ఏటీఎం కార్డు, *22వేల నగదు తీసుకున్నారు. అనంతరం మరో ఏపీ 31 టీవీ 4626 కారులో ఆగస్టు ఆరున సాయంత్రం భద్రగిరిలో విడిచిపెట్టారు. కారు ఇచ్చి ఇంటికి పంపిం చారు. దెబ్బలతో ఇంటికి వెళ్లిన ప్రిన్సిపాల్ రాజాం ఆస్పత్రిలో చికిత్స కోసం 7న జాయిన్ అయ్యారు. అక్కడ తనకు యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు.
పోలీసులు కూడా అలాగే కేసు నమోదు చేశారు. అయితే గాయాలు నయమయ్యాక కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో అసలు విషయం బయటికొచ్చింది. దీంతో ఈ నెల 16న బొబ్బిలి పోలీస్ స్టేష న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ముందు పార్వతీపు రం పోలీసులకు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును వాపసు తీసుకునేందుకు ప్రిన్సిపాల్ కనకల గణేశ్వరరావు కుటుంబ సభ్యులతో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మళ్లీ జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఎసై వి.అశోక్ కుమార్ మాట్లాడుతూ ముందు ఇచ్చిన ఫిర్యాదు ఫాల్స్, కావడంతో మళ్లీ ఫిర్యాదు తీసుకున్నామన్నారు. ఈ విషయమై బొబ్బిలి ఎస్సై ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా, దాడి చేసినట్లు ఫిర్యాదుచేశారు.కేసురిజిష్టర్ చేశామని చెప్పారు.