టెస్ట్‌ట్యూబ్ విధానంలో కవలలు జననం | test tube baby By getting pregnant Gave birth two boy | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ట్యూబ్ విధానంలో కవలలు జననం

Nov 29 2013 3:59 AM | Updated on Sep 2 2017 1:04 AM

టెస్ట్‌ట్యూబ్ విధా నం ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ గురువారం కాకినాడలోని సృ జనా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, ఐవీఎఫ్ సెంటర్‌లో

జగన్నాథపురం (కాకినాడ), న్యూస్‌లైన్ : టెస్ట్‌ట్యూబ్ విధా నం ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ గురువారం కాకినాడలోని సృ జనా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, ఐవీఎఫ్ సెంటర్‌లో కవలలకు జన్మనిచ్చింది. యానాంకు చెందిన ఎన్.శ్రీదేవి (29) టెస్ట్‌ట్యూబ్ విధానం ద్వారా గర్భం దాల్చింది. ఆమెకు గురువారం డాక్టర్ డి.ఎల్.సత్యవతి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేయగా ఒక ఆడబిడ్డకు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరిలో ఒకరు 2.2 కేజీల బరువు ఉండగా మరొకరు 2.1 కేజీ ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement