నేను గర్భవతిని కాదు.. సీరియస్‌గా తీసుకోవద్దు: హీరోయిన్‌ | Poonam Pandey Says I Am Not Pregnant, Video Goes Viral | Sakshi
Sakshi News home page

నేను గర్భవతిని కాదు.. సీరియస్‌గా తీసుకోవద్దు: హీరోయిన్‌

Apr 1 2026 5:11 PM | Updated on Apr 1 2026 6:01 PM

Poonam Pandey Says I Am Not Pregnant, Video Goes Viral

నెటిజన్స్‌ ఊహించే నిజమైంది. నటి పూనమ్‌ పాండే గర్భవతి కాదు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అని ముందే ఊహించారు. తాజాగా అదే నిజమని సదరు నటి ఒపుకుంది. అంతేకాదు బేబీ బంప్‌ ఫోటో పెట్టి.. ప్రెగ్నెంట్‌ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించింది.

అసలేం జరిగింది?
మోడల్, నటి పూనమ్  పాండే పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి. గతంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) పై అవగాహన కోసమని.. తాను మరణించినట్లుగా తప్పుడు వార్తలను ప్రచారం చేయించుకుంది. తాజాగా 'ప్రెగ్నెన్సీ' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. నిన్న ఉదయం(మార్చి 31) తన ఎక్స్‌ ఖాతాలో బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌  చేసింది. అది చూసి చాలా మంది షాకయ్యారు. భర్తతో విడిపోయిన తర్వాత ప్రెగ్నెంట్‌ ఎలా అయిందని కొంతమంది కామెంట్‌ చేశారు. మరికొంతమంది అయితే ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అభిప్రాయపడ్డారు.

అవును..నేను ప్రెగ్నెంట్‌ కాదు
నెటిజన్స్‌ ఊహించనట్లే..తాను ప్రెగ్నెంట్‌ కాదని ప్రకటించింది పూనమ్‌. ఏప్రిల్‌ ఫూల్‌ ప్రాంక్‌ కోసమే ఇలా చేశానంటూ మరో వీడియోని రిలీజ్‌ చేసింది.  ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరినీ కాసేపు అలరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆమె తెలిపారు. ‘నన్ను సీరియస్‌గా తీసుకోవద్దు.. లైఫ్ ని చిల్ చేయండి’అంటూ అభిమానులకు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

పూనమ్‌ పాండే సినీ కెరీర్‌ విషయాలకొస్తే.. హిందీలో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్‌ కర్మ, టచ్‌ ద ఫైర్‌ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాలిని అండ్‌ కో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 2020 సెప్టెంబర్‌ 1న ప్రియుడు సామ్‌ అహ్మద్‌ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement