
తెలుగు ప్రజలను టీడీపీ ఒక్కటి చేస్తుంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు.. ఆ తర్వాత పార్టీ నేతలంతా కలిసున్నది ఒక్క టీడీపీలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు.. ఆ తర్వాత పార్టీ నేతలంతా కలిసున్నది ఒక్క టీడీపీలోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన అధ్యక్షతన టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడిన బాబు.. విభజనకు ముందు అటు తర్వాత పార్టీ నేతలంతా ఏకతాటిపై ఉన్నది ఒక టీడీపీలో మాత్రమేనని తెలిపారు. ఎప్పటికైనా తెలుగు ప్రజలను టీడీపీ ఒక్కటి చేస్తోందన్నారు. అసలు విభజన చట్టాన్ని ఎవరు ఉల్లంఘించారో ప్రజలు గమనించాలన్నారు.
అసెంబ్లీ నుంచి టీటీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలే బుల్లెట్లు.. వారికి భయం అవసరం లేదన్నారు. కూర్చుని సమస్యలు పరిష్కరించకుందామని తెలంగాణ గవర్నమెంట్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.