
బరితెగించిన టీడీపీ
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ డబ్బుల పంపిణీకి తెగబడింది.
రైతునగరం పంచాయతీలో 3 వేల మందికి సర్పంచ్ ఆధ్వర్యంలో ఓటుకు రూ. 5 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక్కడే కాకుండా నంద్యాల, గోస్పాడు మండలాల్లోని గ్రామాలతో పాటు నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లో కూడా టీడీపీ నాయకులు ఓటుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.