
మంత్రి కన్నాకు తెలుగు తమ్ముళ్లు ఝలక్
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి ఏర్పాటైన అడ్హక్ కమిటీ నియామకాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుతమ్ముళ్లు ఆరోపించారు.
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి ఏర్పాటైన అడ్హగ్ కమిటీ నియామకాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుతమ్ముళ్లు ఆరోపించారు. నామినేటెడ్ కమిటీని వెంటనే రద్దు చేయాలని వారు మంత్రి కన్నాను డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం స్టేడియం మైదానానికి వచ్చిన మంత్ర కన్నాను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. మంత్రి కన్నాకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున్న నినాదాలు చేశారు.
అయితే ఆ సమయమంలో మంత్రి కన్నా అనుచరులు రంగప్రవేశం చేసి, మంత్రికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినదించారు. దీంతో తెలుగు తమ్ముళ్లకు, మంత్రి కన్నా అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసేందుకు ఉప్రక్రమించారు. గుంటూరు నగరంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి ఏర్పాటు అయిన అడ్హగ్ కమిటీలో మంత్రి కన్నా అనుచరులకు పెద్దపీట వేస్తున్నారని టీడీపీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.