టీడీపీ క్యాంప్‌ రాజకీయం | tdp starts political tour to tamil nadu? | Sakshi
Sakshi News home page

టీడీపీ క్యాంప్‌ రాజకీయం

Mar 13 2017 10:16 PM | Updated on Oct 16 2018 6:40 PM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ క్యాంప్‌ రాజకీయాలు జోరందుకున్నాయి.

- బస్సులో టూర్‌కు వెళ్లిన విష్ణు వర్గీయులు
- శిల్పా చక్రపాణి రెడ్డికి ఓటు వేయాలని ఒతిళ్లు
- ఒక్కో ఓటుకు రూ. లక్ష ఇచ్చినట్లు సమాచారం


గూడూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ క్యాంప్‌ రాజకీయాలు జోరందుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపే ధ్యేయంగా టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి వర్గానికి చెందిన స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్లను సోమవారం బస్సులో విహారయాత్రకు తరలించారు. వీరంతా మొదట కర్నూలులో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ఒక్కో కౌన్సిలర్‌కు రూ. లక్ష డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. టూర్‌కు వెళ్లిన వారిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుభాషిణి, వైస్‌ చైర్మన్‌ కె.రామాంజనేయులు, మరో పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. వీరిని వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయనీయకుండా విహారయాత్ర పేరుతో ఇక్కడి నుంచి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement