విడాకుల కేసులో కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిన్న కోర్టుకు హాజరయ్యారు.
మచిలీపట్నం : విడాకుల కేసులో కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిన్న కోర్టుకు హాజరయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, ఆయన భార్య సునీత గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. 2012లో భార్యభర్తలు ఇద్దరు తమకు విడాకులు మంజూరు చేయాలని సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించటంతో వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యా భర్తలిద్దరూ కోర్టుకు హాజరవగా, తనకు విడాకులు వద్దని సునీత జడ్జికి విన్నవించారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జనవరి 11వ తేదీకి వాయిదా వేశారు.