వ్యక్తిగత విమర్శలకు దిగిన టిడిపి సభ్యులు | TDP members criticised personally | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత విమర్శలకు దిగిన టిడిపి సభ్యులు

Dec 19 2014 12:51 PM | Updated on Aug 18 2018 5:15 PM

వ్యక్తిగత విమర్శలకు దిగిన టిడిపి సభ్యులు - Sakshi

వ్యక్తిగత విమర్శలకు దిగిన టిడిపి సభ్యులు

శాసనసభలో ప్రభుత్వ పనితీరుని వైఎస్ఆర్సీఎల్పి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టడంతో టీడీపి సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు.

హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వ పనితీరుని వైఎస్ఆర్సీఎల్పి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టడంతో టీడీపి సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు. హుద్హుద్ తుపాను సహాయక చర్యలకు సంబంధించి వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్లు వ్యక్తిగత విమర్శలు చేశారు.  కోర్టు పరిధిలోని అంశాలను సభలో లేవనెత్తారు.

దాంతో వైఎస్ఆర్ సీపి సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండతారన్న భయంతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా  సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇరుపార్టీల సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

వైఎస్ జగన్ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు, రవికుమార్లు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపి సభ్యులు తీవ్రనిరసన తెలిపారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరిశీలించి తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. సభ్యుల వాదోపవాదాల మధ్య సభను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement