తరుమెళ్లకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి | Tarumella YSR CP leaders tribute to the | Sakshi
Sakshi News home page

తరుమెళ్లకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి

Mar 6 2016 2:45 AM | Updated on May 25 2018 9:20 PM

తరుమెళ్లకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి - Sakshi

తరుమెళ్లకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి

ఆర్డీసీ బస్సు బైకును ఢీకొన్న దుర్ఘటనలో మృతిచెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరుమెళ్ల ....

 తెనాలి : ఆర్డీసీ బస్సు బైకును ఢీకొన్న దుర్ఘటనలో మృతిచెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరుమెళ్ల అంబేద్కర్‌కు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. మృతి సమాచారం తెలుసుకున్న నాగార్జున, విశాఖపట్నం నుంచి అప్పటికప్పుడు బయలుదేరి శనివారం ఉదయం తెనాలికి చేరుకొన్నారు. తెనాలి నేత శివకుమార్, పార్టీ నేతలతో కలిసి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న అంబేద్కర్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ప్రమాదం జరిగిన తీరును నాగార్జున, శివకుమార్ అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలి యజేశారు. పార్టీ పట్టణ, రూరల్, అమృతలూరు మండల కన్వీనర్లు యలవర్తి సాంబశివరావు, ఎన్.శివనాగేశ్వరరావు, యలవర్తి రామమోహనరావు, వైఎస్సార్‌సీపీ ఎస్‌సీ సెల్ కార్యదర్శి పెరికల కాంతారావు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బూరెల దుర్గ, షేక్ దుబాయ్‌బాబు, అక్కిదాసు కిరణ్‌కుమార్, ‘మైకా మినిస్ట్రీస్’ పాముల ఐజయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement