‘పేదలు అప్పులు చేసి చికిత్స చేయించుకున్నారు’

Taneti Vanitha Started YSR AArogyasri Aasara Scheme In Eluru - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైద్యానికి, విద్యకు పెద్దపీట వేశారని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ఆసరా పథకం ద్వారా రోగులకు చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ అనగానే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. వైఎస్సార్‌ డాక్టర్‌ కావడంతో పేదవారి గుండె చప్పుడు విని వారికి మెరుగైన చికిత్స కోసం ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద రోగులు కార్పోరేటు చికిత్స పొందారని గుర్తు చేశారు. అలాంటి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం వల్ల పేద ప్రజలు అప్పులు చేసి చికిత్సలు చేయించుకున్నారని తెలిపారు.

వారికి ఎంతో మేలు
ఆరోగ్య శ్రీ పరిధిలో మూడు సీటిలలో హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరును పొం‍దుపరిచామని కలెక్టర్‌ ముత్యాల రాజు పేర్కొన్నారు. వైద్యసేవల ఆనంతరం వారు కోలుకునే వరకూ ఆర్థిక సహాయం అందిం‍చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి ఏలూరు పర్యటనలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలంటూ ఆయన దృష్టికి వచ్చిన వెంటనే వేతనాలు పెంచారని ప్రస్తావించారు. ఈ పథకం వల్ల చికిత్స అనంతరం విశ్రాంతి పొందే రోగులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top