ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు | table tennis competitions ends | Sakshi
Sakshi News home page

ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు

Nov 17 2014 5:39 PM | Updated on Aug 24 2018 2:33 PM

ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు గుంటూరులో ముగిశాయి.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు గుంటూరులో ముగిశాయి. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఏపీ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో అన్ని జిల్లాల నుంచి సుమారు మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

 

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఆటగాళ్ళు  విజేతలుగా నిలిచారు. చివరిరోజు పోటీలను తిలకించేందుకు భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు ఎంఎస్ కే ప్రసాద్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టోర్నమెంట్‌ నిర్వహణకు సంబంధించి ఎంఎస్ కే సంతృప్తి వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement