శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ గొగోయ్‌ దంపతులు

Supreme Court Judge Justice Ranjan Gogoi Visit Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దంపతులు శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ పాల్గొన్న గొగోయ్‌ దంపతులు, అనంతరం తిరు మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవను తిలకించారు. క్షేత్ర సాంప్రదాయ ప్రకారం భూ వరాహ స్వామిని దర్శించుకున్న గొగోయ్‌ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top