సమ్మెకు దిగిన సులభ్‌ కార్మికులు | Sulabh Workers who landed the strike | Sakshi
Sakshi News home page

సమ్మెకు దిగిన సులభ్‌ కార్మికులు

Aug 22 2018 12:13 PM | Updated on Aug 22 2018 12:45 PM

Sulabh Workers who landed the strike - Sakshi

విజిలెన్స్‌ సిబ్బంది, సులభ్‌ కార్మికుల మధ్య స్వల్ప వాగ్విదం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.

తిరుపతి: టీటీడీ విష్ణు నివాసం వద్ద సులభ్‌ కార్మికులు సమ్మెకు దిగారు. విష్ణు నివాసం సముదాయాన్ని బుధవారం సులభ్‌ కార్మికులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విజిలెన్స్‌ సిబ్బంది, సులభ్‌ కార్మికుల మధ్య స్వల్ప వాగ్విదం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో భక్తులను కూడా లోపలికి వెళ్లనీయకుండా విజిలెన్స్‌ అధికారులు గేట్లు వేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితిలో ముగ్గురు మహిళా కార్మికులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

కాంట్రాక్టర్‌ భాస్కర్‌ నాయుడు సీఎం బంధువు అయినందువల్లే రెచ్చిపోతున్నారని, భాస్కర్‌ అనుచరులు మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తున్నారుని పలువురు కార్మికులు ఆరోపణలు గుప్పించారు. భాస్కర్‌ నాయుడికి చెందిన పద్మావతి కాంట్రాక్ట్‌ సంస్థను వెంటనే రద్దు చేయాలని సులభ్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement