రైల్వే ఉద్యోగాలపై రచ్చ | students, unemployees protest against railway notification | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగాలపై రచ్చ

Feb 19 2018 12:48 PM | Updated on Feb 19 2018 12:51 PM

students, unemployees protest against railway notification - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయనగరం : రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డు విడుదల చేసిన గ్రూప్‌ డి నోటిఫికేషన్‌పై విద్యార్ధులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పదో తరగతి చదివిన వారితోపాటు అదనంగా ఐటీఐ, టెక్నికల్‌ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. విజయనగరం కోట జంక్షన్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ర్యాలీని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలి రావడంతో పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement