స్నేహితులతో ఈత కోసమని సరదాగా వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతిచెందిన సంఘటన మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెలో శనివారం చోటుచేసుకుం ది.
మరిపెడ : స్నేహితులతో ఈత కోసమని సరదాగా వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతిచెందిన సంఘటన మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెలో శనివారం చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని సీతారాంపురం వీధికి చెందిన గడ్డం మల్సూర్, రాములమ్మ దంపతుల ఏకైక కుమారుడురాము(13) ఇదే వీధిలోని సీతారాంపురం హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.
పాఠశాలలో త్రైమాసిక పరీక్షలు రాసిన తర్వాత తన తరగతి స్నేహితులైన గుండా సాయి, ఎల్లుట్ల లోకేష్, బాలం సం దీప్, ప్రశాంత్, గణేష్‌తో కలిసి ఆటోలో పురుషోత్తమాయ గూడేనికి చెందిన నూకల నరేష్ రెడ్డి మామిడితోటలో ఉన్న నీటి పంపింగ్ స్టోరేజ్ కొలనులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. మెట్లు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాము కొలనులో పడి మునిగిపోయూడు. దీంతో మిగతా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వారిని గమనించిన తోట కాపరి బోధ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ముగ్గురు విద్యార్థులు చేతికి దొరకగా... విషయం అడగడంతో రాము నీటమునిగినట్లు వారు చెప్పారు. అతడి సమాచారంతో కురవి సీఐ కరుణసాగర్‌రెడ్డి, మరిపెడ ఎస్సై నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా చేశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెళ్లెల్లు శోకసంద్రంలో మునిగిపోయారు.