‘మరుగుదొడ్డి కట్టించలేని నీవు ఒక సీఎంవేనా’ | student organization leader criticize the government | Sakshi
Sakshi News home page

‘మరుగుదొడ్డి కట్టించలేని నీవు ఒక సీఎంవేనా’

Apr 18 2017 9:03 PM | Updated on Aug 14 2018 2:13 PM

మున్సిపల్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఒక మరుగుదొడ్డి కట్టించలేని నీవు హైటెక్కు సీఎంనని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎస్‌ఎఫ్‌ఐ ఓ ప్రకటనలో ప్రశ్నించింది.

విజయవాడ: నగరంలోని ఓ మున్సిపల్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఒక మరుగుదొడ్డి కట్టించలేని నీవు హైటెక్కు సీఎంనని చెప్పుకోవడం సిగ్గుచేటని భారత విద్యార్ధి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) ఓ ప్రకటనలో ప్రశ్నించింది. విజయవాడలోని విద్యార్థినీలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక సీఎం డొంకతిరుగుడు బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ , స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అని  కోట్ల రూపాయలతో ఖర్చు చేసి చంద్రబాబు, మంత్రి నారాయణ పెద్ద పెద్ద ఫోటోలు ప్రచారం చేసుకున్నారు

కానీ పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవని తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం బాబు అసమర్ధతే కారణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement