పవిత్రతకు భంగం కలిగించొద్దు | Srikanth Reddy fire on TDP Government | Sakshi
Sakshi News home page

పవిత్రతకు భంగం కలిగించొద్దు

Jan 21 2016 4:18 AM | Updated on May 29 2018 4:26 PM

పవిత్రతకు భంగం కలిగించొద్దు - Sakshi

పవిత్రతకు భంగం కలిగించొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల పవిత్రతకు భంగం కలిగిస్తోందని, చట్ట సభ గౌరవాన్ని దిగజార్చే

ఆరోగ్యమిత్రల పొట్టకొట్టడం దారుణం: గడికోట ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల పవిత్రతకు భంగం కలిగిస్తోందని, చట్ట సభ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలను హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తామని, కోనేరు లక్ష్మయ్య ప్రైవేటు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామని రకరకాలుగా ప్రభుత్వం చెప్పడం అర్థం కాకుండా ఉందని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాటాడారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లో మనకు అన్ని హక్కులూ ఉండగా తాత్కాలిక అసెంబ్లీ సమావేశాలంటూ ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాల్లో నిర్వహించడానికి ఎందుకు తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని,  మౌలిక సదుపాయాలు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయడంపైనే అభ్యంతరమని చెప్పారు.

 ఆరోగ్యమిత్రల తొలగింపు దారుణం
  ఉదాత్తమైన లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగులను జీవో నెంబర్-28 ద్వారా తొలగించి వారి పొట్ట కొట్టడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement