మార్ఫింగ్‌ వీడియోలపై తమ్మినేని సీరియస్‌

Speaker Tamineni Seetaram Chitchat With Media On Video Morphing - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్‌ చేయడం తీవ్రమైన అంశమని స్పీకర్‌ తమ్మినేని సీతారం అ‍న్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ కార్యక్రమం నిర్వహించారు. సభలో జరుగుతున్న పరిణామాలను తప్పుగా మార్ఫింగ్‌ చేసి వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను వేసుకున్న డ్రస్‌ మార్ఫింగ్‌ వీడియోలో ఉన్న డ్రస్‌ కూడా వేరు వేరు అని చెప్పారు. దీనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మీడియా అయిన సోషల్‌ మీడియా అయినా సరే మార్ఫింగ్‌ చేయడం తప్పని తమ్మినేని హితవు పలికారు. (ఏపీ: అసెంబ్లీ నిర‍్వహణపై కీలక నిర్ణయాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top