26 రోజులుగా పూజలు.. ఆ పాము మృతి

Snake Died In Durgada Village East Godavari - Sakshi

ఎస్సై కారణముటూ గ్రామస్తుల ఆందోళన

గుడి కట్టే ఆలోచనలో ప్రజలు

సాక్షి, పిఠాపురం(తూర్పుగోదావరి): గత కొన్ని రోజులుగా జిల్లా ప్రజలు దేవుడని కొలుస్తూ పూజలు చేస్తున్న పాము గురువారం మృతిచెందింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని ఓ రైతు పొలంలో 26 రోజుల క్రితం కనిపించిన పామును గ్రామ ప్రజలు సుబ్రమణ్య స్వామి స్వరూపం అంటూ పూజలు చేశారు. ఆ పాము గ్రామస్తుల దగ్గరికి వెళ్లినా వారిని కాటు వేయకపోవడంతో సాక్షాత్తు దేవుడేనంటూ మరింత నమ్మకం ఏర్పరుచుకున్నారు. బుధవారం కుసుం విడిచిన పాము అనుకోకుండా మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎస్సైయే కారణం.. గత కొన్ని రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పాము మృతిచెందటానికి గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ కారణమంటూ దుర్గాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎస్సైను సస్పెండ్‌ చేయాలంటూ గ్రామస్తులు జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. పాము మృతి చెందిన స్థలంలో గుడి కట్టాలని గ్రామ ప్రజలు భావిస్తున్నారు.      

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top