జిల్లాలో పట్టణ వాసం మేడిపండును తలపిస్తోంది. అధిక జనాభా మురికి వాడల్లో ఉంటున్నట్టు అధికారిక గణంకాలు తెలియజేస్తున్నాయి.
జిల్లాలో పట్టణ వాసం మేడిపండును తలపిస్తోంది. అధిక జనాభా మురికి వాడల్లో ఉంటున్నట్టు అధికారిక గణంకాలు తెలియజేస్తున్నాయి. అత్యధికంగా వినుకొండ మున్సిపాలిటీలో, అత్యల్పంగా చిలకలూరిపేట మున్సిపాలిటిలో ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో గ్రామీణం కంటే పట్టణ ప్రాంతంలో మెరుగైన పరిస్థితులు లేవని తెలుస్తోంది.
చిలకలూరిపేట
గుంటూరు నగరపాలక పాలక సంస్థ పరిధిలో ఉన్న మొత్తం 7,43,354 జనభాలో 1,89,001 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఇది మొత్తం జనాభాలో 25.43 శాతానికి సమానం.
మిగిలిన మున్సిపాలిటీల్లో మురికివాడల్లో ఉన్న జనాభాను పరిశీలిస్తే వినుకొండలో ఉన్న జనాభాలో అత్యధిక మంది మురికివాడల్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం జనాభా 59,725 మంది కాగా, 47,962 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఇది 80.3 శాతానికి సమానం.
జిల్లాలో అత్యల్పంగా మురికివాడల్లో నివసించే మున్సిపాలిటీని పరిశీలిస్తే ఉన్న చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం జనాభా 1,01,398 మంది కాగా ఇందులో 31,594 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఇది 31.16 శాతానికి సమానం.
అనేక మున్సిపాలిటీలలో ఇప్పటికి కొందరు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఉపయోగించి నీళ్లు కొట్టే పాతకాలం నాటి మరుగు దొడ్లుకు వెళుతున్నారు. ఈ కారణంగా మానవ విసర్జితాలు డ్రైన్లలో కలిసిపోతున్నాయి. కర్మకారి సఫాయి చట్టం ప్రకారం మానవ విసర్జిత మలాన్ని పారిశుద్ధ్య కార్మికులు సైతం ఎత్తివేయరాదు. అయినప్పటికీ ఈ చట్టం ఉల్లంఘన జరుగుతోంది. మురికివాడల్లో సమ స్యల పరిష్కారానికి పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది.