‘రెండో విడత’ టీడీపీ డబ్బు పంపిణీ | 'Second wave' paper Distribution of money in TDP | Sakshi
Sakshi News home page

‘రెండో విడత’ టీడీపీ డబ్బు పంపిణీ

Apr 10 2014 2:41 AM | Updated on Sep 2 2017 5:48 AM

రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడటంతో ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునేందు కు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది.

సాక్షి, తిరుపతి: రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడటంతో ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునేందు కు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. పోలింగ్ కు 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో డబ్బు పంపిణీతో పాటు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. తొలివిడతలో భారీగా డబ్బు పంపిణీ చేసినా ఓటింగ్ సరళి అనుకూలంగా లేకపోవడంతో రెండో విడత మరింత ఎక్కువగా పంపిణీ చే స్తున్నారు.

ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థులు పోటీలు పడి ఎంపీటీసీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీ అభ్యర్థులు డబ్బుతో పాటు తాయిలాల పం పిణీలో తలమునకలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో టీడీపీ వారు రూ.కోటి వరకు పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. సత్యవేడు మండలం లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి పది లక్షల రూపాయలు అందజేశారు.

ఇక్కడ ఓట్ల సంఖ్యతో పనిలేకుండా ఇంటికి రెండు వేల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు. పుత్తూరు మండలంలో మహిళలకు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, యువకులకు క్రికెట్ కిట్లు అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ నమూనాలు చూపించి తాయిలాలు ఇస్తున్నారు. ఇక్కడ మద్యం కూడా భారీగా పంపిణీ చేస్తున్నారు.

ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయలు వంతున పం పిణీ చేస్తున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో గురువారం డబ్బు పంపిణీ చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement