'చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ను కాంగ్రెస్లో విలీనం చేయాలి' | Sarvey Sathyanarayana says K Chandrasekhar Rao should merge TRS in Congress | Sakshi
Sakshi News home page

'చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ను కాంగ్రెస్లో విలీనం చేయాలి'

Dec 7 2013 8:17 PM | Updated on Aug 15 2018 8:12 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడం ఖాయమని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడం ఖాయమని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోందని, కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందని మంత్రి చెప్పారు. ఏలాంటి మెలికలు పెట్టకుండా తెలంగాణ ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద మద్ర వేసిన సంగతి తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించింది. రాష్ట్రపతి బిల్లును త్వరలో అసెంబ్లీకి పంపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement