'రక్షణ ఇస్తేనే బస్సులు తిప్పుతాం' | RTC suspends services to TN | Sakshi
Sakshi News home page

'రక్షణ ఇస్తేనే బస్సులు తిప్పుతాం'

Apr 15 2015 7:59 AM | Updated on Aug 13 2018 3:11 PM

సరైన రక్షణ కల్పిస్తేనే తమిళనాడులో బస్సులు తిప్పుతామంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

చిత్తూరు: సరైన రక్షణ కల్పిస్తేనే తమిళనాడులో బస్సులు తిప్పుతామంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. దీంతో చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం తమిళనాడు అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ మంతనాలు జరుపుతోంది. కానీ, ఈ విషయంలో తమిళనాడు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్కౌంటర్ను నిరసనగా తమిళనాడులో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగానే కొనసాగుతున్నాయి.
దీంతో ఆందోళనల ముసుగులో బస్సుల పై దాడులు చేస్తే ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమిళనాడుకు సర్వీసులను రద్దు చేయడంతో 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్టు అంచనా..
 ఇదిలా ఉండగా,  శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement