ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | Rtc bus colliding Woman died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Oct 30 2013 1:54 AM | Updated on Sep 2 2017 12:06 AM

రాష్ర్టపతి రోడ్డులోని ఆర్వోబీ దిగువన రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది.

 తణుకు క్రైం, న్యూస్‌లైన్ : రాష్ర్టపతి రోడ్డులోని ఆర్వోబీ దిగువన రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. పైడిపర్రులో నివాసముంటున్న సంగుల సత్యవతి (65) అలియాస్ వంటల సత్యవతిని మంగళవారం కొవ్వూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె  తల, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రమాదాన్ని చూసి బాధితురాలిని ఆటోలో ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.  సత్యవతి వంటలు చేసి జీవిస్తోందని, మంగళవారం మధ్యాహ్నం జాతీయ రహదారి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో వంట  చేసి వస్తుండగా ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు.  ఆమె వద్ద ఉన్న సంచిలో స్థానిక ప్రైవేటు ఆర్థోపెడిక్ ఆసుపత్రి అపాయింట్‌మెంట్ కార్డు, చెవి మిషన్ ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement