భారీగా డంప్ చేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
ఒంటిమిట్ట (వైఎస్సార్ జిల్లా) : భారీగా డంప్ చేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా ఎర్ర చందనాన్ని డంప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి సుమారు రూ. 5కోట్ల విలువ చేసే 160 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.