యువకుడికి క్రిక్‌బజ్ రూ. 10లక్షల బహుమతి | Rs 10 lakhs of prize Cricbuzz to Duggirala youngster | Sakshi
Sakshi News home page

యువకుడికి క్రిక్‌బజ్ రూ. 10లక్షల బహుమతి

May 25 2015 10:36 PM | Updated on Sep 3 2017 2:40 AM

ఐపీఎల్ క్రికెట్ పై క్రిక్ బజ్.కాం నిర్వహించిన డ్రీమ్ టీమ్ ఎంపిక స్కీమ్‌లో దుగ్గిరాలకు చెందిన యువకుడు జంపాల శివ కుమార్ జాక్‌పాట్ కొట్టేశాడు.

దుగ్గిరాల(గుంటూరు జిల్లా): ఐపీఎల్ క్రికెట్ పై క్రిక్ బజ్.కాం నిర్వహించిన డ్రీమ్ టీమ్ ఎంపిక స్కీమ్‌లో దుగ్గిరాలకు చెందిన యువకుడు జంపాల శివ కుమార్ జాక్‌పాట్ కొట్టేశాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివకుమార్ ఎంపిక చేసిన టీమ్ మొదటి బహుమతి గెల్చుకుంది. ఆదివారం జరిగిన చెన్నై, ముంబాయి జట్ల నుంచి 11 మంది క్రీడాకారులతో ఎంపిక చేసిన జట్టు 389 పాయింట్లు రావటంతో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న 3 వేల జట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది.

మొత్తం రూ.25 లక్షల బహుమతుల ప్రకటించగా ప్రథమ స్థానంలో నిలిచిన తాను రూ.10 లక్షలు బహుమతికి అర్హత సాధించినట్టు శివకుమార్ చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 30.9 శాతం పన్నులు మినహాయించి, రూ.7.25 లక్షలు ఐదు రోజుల్లో డ్రా చేసుకునే విధంగా అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అందుకు అవసరమైన పాన్‌కార్డు, బ్యాంకు వివరాలను క్రిక్ బజ్ వారు కోరటంతో అన్ని వివరాలు పంపినట్టు తెలిపాడు. క్రికెట్‌పై ఆసక్తే తనకు రూ.10 లక్షలు బహుమతి గెలుసుకునేలా చేసిందని ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement