
అనిల్ చంద్ర పునేతా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనిల్ చంద్ర పునేతా రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అనిల్ చంద్ర పునేతా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తేలడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీ, అప్పుడు ఏపీ సీఎస్‌గా పని చేస్తున్న అనిల్ చంద్ర పునేతాను సీఎస్‌గా తప్పించిన సంగతి తెల్సిందే. అనంతరం ఆయన స్థానంలో ఎల్‌వీ సుబ్రహ్మణ్యాన్ని ఏపీ సీఎస్‌గా నియమించిన విషయం విదితమే.