డైమండ్ రాణి | restoration of the state of the art showroom | Sakshi
Sakshi News home page

డైమండ్ రాణి

Aug 3 2015 12:42 AM | Updated on Sep 3 2017 6:39 AM

డైమండ్ రాణి

డైమండ్ రాణి

భారత దేశంలో ప్రముఖ వజ్రాభరణాల బ్రాండ్ కీర్తిలాల్స్ వారు నగరంలోని తమ షోరూంను అతిపెద్ద వజ్రాల నిలయంగా పునరుద్ధరించారు.

నగరంలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన వజ్రాల దుకాణాన్ని  నటి రెజీనా కసాండ్రా ఆదివారం ప్రారంభించారు.
వజ్రాభరణాలను ధరించి కొద్దిసేపు సందడి చేశారు.

 
లబ్బీపేట : భారత దేశంలో ప్రముఖ వజ్రాభరణాల బ్రాండ్ కీర్తిలాల్స్ వారు నగరంలోని తమ షోరూంను అతిపెద్ద వజ్రాల నిలయంగా పునరుద్ధరించారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన మహాత్మాగాంధీ రోడ్డులోని షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ హీరోయిన్, కీర్తిలాల్స్ కస్టమర్ రెజీనా కసాండ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తిలాల్స్ బిజినెస్ డెరైక్టర్ సూరజ్ శాంతకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వజ్రాభరణాల్లో విస్తృతశ్రేణిని డిమాండ్ చేస్తున్నాయన్నారు. సరికొత్త డిజైన్లతో అందరికీ వజ్రాభరణాలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సంప్రదాయ రీతులను అభిమానించే వారితో పాటు అందరినీ ఆకట్టుకునేలా ప్రత్యేక శ్రేణి వజ్రాభరణాలను కొత్త షోరూంలో ప్రదర్శిస్తున్నామన్నారు.

భారతీయ కళాత్మక అభిరుచులకు అద్దంపడుతూ చక్కని వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని వివరించారు. గనుల నుంచి నేరుగా వజ్రాలను తీసుకు రావడం, వజ్రాల కటింగ్ కర్మాగారాలు, అత్యాధునిక డిజైన్ స్టూడియోలు, ఉత్పత్తి కేంద్రాల వరకు ఒకే కప్పుకింద సమకూర్చుకుని ప్రపంచ వజ్రాభరణాల సారథ్య వర్తకుల్లో ఒకరిగా కీర్తిలాల్స్ నిలిచిందని తెలిపారు. సీనీ హీరోయిన్ రెజినా కసాండ్రా మాట్లాడు తూ కీర్తిలాల్స్‌లోని విభిన్న రకాల వజ్రాభరణా లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. కీర్తిలాల్స్ జనరల్ మేనేజర్ జి. మధుసూదన్, రిటైల్ అండ్ సేల్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎం. రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement