విద్యార్థుల భోజనంలో ఎలుక చర్మం

Rat Skin In Lunch In YSR Kadapa - Sakshi

సాక్షి, అమరావతి/ వైఎస్‌ఆర్‌ : ప్రభుత్వ పాఠశాలలో భోజన తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. జిల్లాలోని సరోజిని నగర్‌లో ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వడ్డించే పప్పులో సోమవారం ఎలుక చర్మం, పేగులు వచ్చాయి. పిల్లలకు వడ్డించే భోజనంలో​ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది దీన్ని బట్టిచూస్తే అర్థమవుతోంది. భోజన తయారిని ఏపీ ప్రభుత్వం ప్రయివేటీకరించడంతో ఇస్కాన్‌ సంస్థ భోజనాన్ని తయారు చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ఇస్కాన్‌ చెలగాటం ఆడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 100 పాఠశాలలకు ఇదే సంస్థ భోజనాన్ని పంపిణీ చేస్తోంది. కాగా  భోజన తయారిని ప్రభుత్వం ప్రయివేటీకరించడం ప్రజలు తీవ్రంగ తప్పుపడుతున్న విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top