న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించి, సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అమెరికాలోని ప్రముఖ నగరానికి సారధ్యం వహించే తొలి ముస్లిం నేతగా, ఈ పదవిని చేపట్టిన మొదటి దక్షిణాసియా వ్యక్తిగా, అత్యంత పిన్నవయస్కుడు(34)అయిన మేయర్‌గా గుర్తింపు పొందారు.
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తొలిరోజున డెమొక్రాట్ ఫైర్‌బ్రాండ్ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌తో పాటు లంచ్ మీట్‌లో భారతీయ భోజనం చేశారు. భారత సంతతికి చెందిన మమ్దానీ తన మొదటి రోజు షెడ్యూల్ ఇంటర్వ్యూలు, సమావేశాలతో గడిచింది. అయితే ‘జాక్సన్ హైట్స్‌లోని లాలిగురాస్ బిస్ట్రోలో మా కాంగ్రెస్ మహిళా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌తో కలసి భోజనం చేయడం ఎంతో ప్రత్యేకమైనది’ అని జోహ్రాన్ మమ్దానీ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.
A busy first day as your Mayor-elect: early morning interviews, transition announcements and meetings. More to say on all of it tomorrow.
But a highlight was lunch with my Congresswoman @AOC at Laliguras Bistro in Jackson Heights. pic.twitter.com/vKWpNyrI09— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 6, 2025
దీనికి సంబంధించిన ఫొటోలో భారతీయ వంటకాలైన మోమోలు, దమ్ ఆలూ, పనీర్ టిక్కాతోపాటు టీని వారు ఆస్వాదించినట్లు తెలుస్తోంది. ఇది అతని దక్షిణాసియా వారసత్వానికి గుర్తుగా కనిపిస్తోంది. లాలిగురాస్ బిస్ట్రో అనేది జాక్సన్ హైట్స్‌లోని ఒక భారతీయ- నేపాలీ రెస్టారెంట్. కాగా మమ్దానీ మేయర్ పదవికి పోటీ పడేందుకు మద్దతు పలికిన కొద్దిమంది డెమొక్రాట్లలో ఒకాసియో-కోర్టెజ్ కూడా ఉన్నారు. మమ్దానీ తన తొలి ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగంలోని వాక్యాలను గుర్తుచేశారు. మేయర్ విజయోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ధూమ్’ సినిమా బీట్స్ వినిపించాయి.
ఇది కూడా చదవండి: ‘పిచ్చి పని’.. రాహుల్ ‘ఫొటో’పై కంగుతిన్న మోడల్


