రూ.వెయ్యి పంపిణీ కోడ్‌ ఉల్లంఘన కాదు

Ramesh Kumar Comments On Rs 1000 Distribution To Poor People - Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ స్పష్టీకరణ

కన్నా, రామకృష్ణ లేఖలకు బదులిచ్చిన ఎస్‌ఈసీ

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే రూ. 1,000 పంపిణీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో లేదని చెప్పారు. రూ. వెయ్యి పంపిణీపై ఫిర్యాదు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తనకు రాసిన లేఖలకు ఆయన బదులిచ్చారు. ఇదే విషయంపై ఆయన ప్రకటన విడుదల చేశారు. 

► నగదు పంపిణీ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. 
► అయితే ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని, పోటీ చేసే అభ్యర్థులు స్వప్రయోజనం కోసం ప్రచారం, ఓటర్లను ప్రభావితం చెయ్యడం వంటివి ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 
► అటువంటి సంఘటనపై క్షేత్రస్థాయిలో నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని రావాలంటూ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల పరిశీలకులకు 
లేఖ రాశారు. 
► సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top