సదా ప్రజల సేవకుడినే

Rajya Sabha Member Vemireddy Prabhakar Reddy Said He Would Work For The Public - Sakshi

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

మంత్రి అనిల్‌తో కలిసి వాటర్‌ ప్లాంటు ప్రారంభం

సాక్షి, నెల్లూరు(సెంట్రల్‌): ప్రజలకు సదా సేవకుడిలా పనిచేస్తానని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.  నెల్లూరులోని 9వ డివిజన్‌ ప్రాంతంలో వీపీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఇరిగేషన్‌ మంత్రి పి.అనిల్‌కుమార్‌తో కలిసి శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 36 మండలాల్లో 88 వాటర్‌ ప్లాంట్లు ప్రజల అవసరార్థం వీపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేçస్తూ ఈ కార్యక్రమం ముందుకుతుందన్నారు.

తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు వీపీఆర్‌ ఫౌండేషన్‌ ఎప్పుడూ చేయూతనిస్తుందని తెలిపారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన అనిల్‌కుమార్‌ ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అనిల్‌కుమార్‌కు కీలకమైన మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఎక్కడ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అడిగినా కాదనకుండా ఏర్పాటు చేస్తున్న ఆయన అపర భగీరథుడని కొనియాడారు.

కార్యక్రమంలో పి.రూప్‌కుమార్‌యాదవ్, వీపీఆర్‌ ఫౌండేషన్‌ సీఈఓ నారాయణరెడ్డి, ఎన్‌.శంకర్, రాజేశ్వరరెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, దామవరపు రాజశేఖర్, తిప్పిరెడ్డి రఘురామిరెడ్డి, వంగాల శ్రీనివాసులురెడ్డి, మంగిశెట్టి శ్యామ్, పొడమేకల సురేష్, ఈదల ధనూజారెడ్డి, మర్రి శ్రీధర్, అద్దంకి జగన్, తంబి, వెంకటరమణ, బాలు, మోహన్, పి.లక్ష్మీనారాయణ, నూనె మల్లికార్జున్‌యాదవ్, పప్పు నారాయణ, గాదంశెట్టి గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top