నేడు కేసీ రెడ్డి రాక | Rajiv Education Employment Mission chairman KC REDDY coming | Sakshi
Sakshi News home page

నేడు కేసీ రెడ్డి రాక

Feb 4 2014 1:14 AM | Updated on Sep 2 2017 3:18 AM

రాజీవ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ మిషన్ చైర్మన్ కేసీ రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో

 కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : రాజీవ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ మిషన్ చైర్మన్ కేసీ రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10.05 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 11.10 గంటలకు కాకినాడ చేరుకుంటారు. 11.30 గంటలకు పీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ మోడల్ విత్ జెన్‌ప్యాక్ట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ జేఎన్‌టీయులో ఏర్పాటు చేసిన ఫినిషింగ్ స్కూల్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వర్క్‌షాపులో పాల్గొం టారు. మధ్యాహ్నం 1.30 గంటలకు డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3.30 గంటలకు రాజమండ్రి చేరుకుని 4 గంటలకు రాజమండ్రి కాయర్ బోర్డులో వికలాంగులకు ఏర్పాటు చేసిన శిక్షణను ఆయన ప్రారంభిస్తారు. 4.30 గంటలకు రాజమండ్రి మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద స్వయం డ్రైవింగ్‌పై శిక్షణను ప్రారంభిస్తారు. 5 గంటలకు బొమ్మూరు ఎన్‌ఏసీ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడతారు. రాత్రికి రాజమండ్రిలో బస చేసి, బుధవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement