‘బాబు అవకాశవాద రాజకీయ నాయకుడు’ | Rachamallu Siva Prasad Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు అవకాశవాద రాజకీయ నాయకుడు’

Nov 3 2018 5:12 PM | Updated on Nov 3 2018 8:58 PM

సాక్షి, వైఎ‍స్సార్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయ నాయకుడని వైఎస్సార్‌ సీపీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మొదలై ఆ పార్టీతో ముగింపు కానుందని అన్నారు. తెలుగువారి ఆత్మగోషను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడని మండిపడ్డారు.

ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. సోనియాగాంధీని ఇటలి దయ్యం.. రాహూల్ గాంధీని పప్పు అని సంభోదించి వారితో కలిసిపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement