వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం బహిరంగసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హైదరబాద్‌లో ఇటీవల జరిగిన సమన్వయకర్తల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు వివరించారు.
తెలంగాణలో పార్టీకి ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక్కడ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాలకు ఈ సభ స్ఫూర్తిగా నిలవాలని, ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామాలింగేశ్వరరావు (సత్తుపల్లి), ఎడవల్లి కృష్ణ(కొత్తగూడెం), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), బానోత్ మదన్‌లాల్(వైరా), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారరావుపేట), సామాన్యకిరణ్(మధిర), నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మార్కం లింగయ్యగౌడ్, ముస్తాఫా, మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.