తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
సామర్లకోట (తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని గొల్లగూడెం వీధికి చెందిన రాజు, సుగుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హారతి(25) వివాహం విజయవాడకు చెందిన కల్యాణ్‌కుమార్‌తో ఏడాదిన్నర క్రితం అయింది.
పెళ్లయిన నాటి నుంచి భర్తతోపాటు అత్తమామలు మరింత కట్నం తేవాలని వేధిస్తున్నారు. కాగా గర్భవతి అయిన హారతి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. శనివారం ఉదయం చూసేసరికి ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.