'ద్విచక్ర వాహనం నెంబరుతో దిరుగుతున్నకారు కోసం గాలింపు' | police searches ford fiesta car escaping with duplicate number | Sakshi
Sakshi News home page

'ద్విచక్ర వాహనం నెంబరుతో దిరుగుతున్నకారు కోసం గాలింపు'

Nov 16 2013 10:38 PM | Updated on Sep 4 2018 5:07 PM

ద్విచక్ర వాహన నంబర్‌ను కారుకు ఏర్పాటు చేసుకొని తిరుగుతుండగా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కారు కోసం గాలింపు చేపట్టారు.

హైదరాబాద్: ద్విచక్ర వాహన నంబర్‌ను కారుకు ఏర్పాటు చేసుకొని తిరుగుతుండగా  బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కారు కోసం గాలింపు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. బాలకృష్ణారెడ్డి తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 2లో ఇటీవల ఏపీ 09 సీడీ 8460 ఫోర్డ్ ఫియస్టా కారును రాంగ్ రూట్‌లో వెళ్తుండగా గుర్తించారు. ఆపకుండా వెళ్తున్న ఈ కారును ఆన్‌లైన్ చలానా ద్వారా జరిమానా విధించేందుకు అడ్రస్ కోసం ఆరా తీశారు. అయితే ఈ నెంబర్‌పై ఎలాంటి కారు లేకపోగా హోండా యాక్టీవా స్కూటర్ మాత్రం ఉన్నట్లు గుర్తించారు. దొంగ నంబర్‌తో ఈ కారును నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు కారు కోసం గాలింపు చేపట్టారు. ఇది ఖచ్చితంగా దొంగిలించిన కారు అయి ఉంటుందని వెల్లడించారు. ఈ నంబర్‌తో ఉన్న హోండా యాక్టివా ఓ యువతికి చెందినదని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement