breaking news
ford fiesta
-
సంచలన నిర్ణయం తీసుకున్న ఫోర్డ్ కంపెనీ
-
‘చేతులెత్తేసింది’, 47ఏళ్ల తర్వాత..ఆ కార్ల తయారీ నిలిపివేయనున్న ఫోర్డ్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచంలోనే వాహనదారులు అత్యంత ఇష్టపడే కార్లలో ఒకటైన ‘ఫోర్డు ఫియస్టా’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఫోర్డ్ బాస్ మరో వారంలో స్పష్టమైన ప్రకటన చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 1970లలో పలు సమస్యల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. ఫలితంగా మోడెస్ట్, ఎకనమికల్ కార్లకు డిమాండ్ పెరిగింది. దీంతో యూరోపియన్ కస్టమర్ల కోసం ఆటోమొబైల్ కంపెనీలు ఫియట్, రెనాల్ట్, వోక్స్వ్యాగన్ బడ్జెట్ కార్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. చదవండి👉 యాపిల్‌కు ఎదురు దెబ్బ, ఎలక్ట్రిక్ కార్ల రహస్యాల్ని దొంగిలించిన ఉద్యోగి! అదే సమయంలో 1972లో ప్రత్యర్ధి ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హెన్రీ ఫోర్డ్-2 రెండు డోర్లతో ‘బాబ్‌క్యాట్’ప్రాజెక్ట్ పేరుతో కారును తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రణాళికలు, అనేక రకాలైన కార్ల డిజైన్లను రూపొందించిన మూడేళ్ల తర్వాత 1975లో ఫియస్టా పేరుతో తొలి వేరియంట్ ఫోర్డు కారును ఆవిష్కరించారు. 1976లో ఆ కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే యూరోపియన్ మార్కెట్లో సూపర్ మినీ కార్లుగా వోక్స్ వ్యాగన్ పోలో, రెనాల్ట్ 5 లు మార్కెట్‌ను శాసిస్తుండగా.. బడ్జెట్ ధరలో నడిపేందుకు సౌకర్యంగా ఉండేలా ప్రజలు ఎలాంటి కారైతే కోరుకున్నారో.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫియస్టా ఎంకే 1ను ఫోర్డు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆ సంస్థ రూపురేఖలు మారిపోయాయి. వెరసి నాలుగేళ్లకే (1980) వన్ మిలియన్ కార్లను అమ్మకాలు జరిపి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మార్కెట్లో విడుదలైన ఫోర్డ్ ఎక్స్ఆర్ సైతం1980లలో రేసర్ల కలల కారుగా మారింది. 1982 నాటికి అమ్మకాలు 2 మిలియన్ల మార్కును అధిగమించాయి. యూకేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతుండడంతో ఆ మోడళ్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఫోర్డు ఫియాస్టా సెకండ్ జనరేషన్ ఫియస్టా మార్క్2ను ఫోర్డ్ వాహన దారులకు పరిచయం చేశారు. 1983 - 1989 మధ్య కాలంలో తిరుగులేని కారుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. 1989లో ఫియస్టా మార్క్ 3వ జనరేషన్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో చిన్న కారును తయారు చేసింది. 1.0-లీటర్ మరియు 1.1-లీటర్ ఇంజన్లతో వచ్చింది. నిర్వహణ ఖర్చులు సైతం తగ్గించింది. 1995లో ఫియస్టా మార్క్ 4వ జనరేషన్, 2001లో ఫియస్టా మార్క్ 5వ జనరేషన్, 2006లో ఫియస్టా 6వ జనరేషన్, 2012లో ఫియస్టా మార్క్ 7వ జనరేషన్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనాలకు తెరతీసింది. అయితే ఇటీవల మార్కెట్లో కార్ల విడిభాగాల ధరలు పెరగడం, కొనుగోలు దారులు ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఫోర్డ్ ఫియస్టా కారు తయారీని వచ్చే ఏడాదిలో ఫోర్డ్ నిలిపివేయనుంది. ఫోర్డ్ ఫియస్టా వేరియంట్ కార్ల తయారీ నిలిపివేతపై ఫోర్డ్ బాస్ విలియం క్లే ఫోర్డ్ స్పష్టత ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
న్యూ అవతార్ గా ఫోర్డ్ ఫియస్టా
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్, తన తర్వాతి తరం ఫియస్టా తయారీలో బిజీ బిజీగా ఉందట. 2017లో జరిగే మోటార్ షోల్లో ఈ బ్రాండ్ ను రివీల్ చేయడానికి సిద్దమవుతోందట. 2018 లో ఈ మోడల్ గ్లోబల్ గా అమ్మకానికి రానుందని తెలుస్తోంది. ఇటీవలే యూరప్ లో ఈ కొత్త ఫియస్టాను టెస్టింగ్ కూడా చేసిందట. ఈ మోడల్ డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే.. ఫోర్డ్ ప్రవేశపెట్టబోయే తర్వాతి తరం ఫియస్టా బహుశ పొడవు ఎక్కువ ఉండొచ్చట. ప్రస్తుతమున్న దానికి విభిన్నంగా, విస్తృతంగా రూపొందిస్తున్నారు. ఫోర్డ్స్ కైనెటిక్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారితంగా ఇది తయారవుతుందట. న్యూ గ్రిల్ లుక్ కూడా ప్రస్తుతమున్న దానికంటే చిన్నగా, బిగుతుగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతమున్న మోడల్ కు ఈ తర్వాతి తరం ఫియస్టా ఏమాత్రం తీసిపోదంట. ఈ కారు వెనుక భాగంలో ముఖ్యమైన మార్పులే చేయబోతుందట. వెడల్పును పెంచి, వెనుక భాగంలో విండ్ స్క్రీన్ ను పెంచబోతున్నారని తెలుస్తోంది. టైల్ ల్యాంప్స్ చుట్టూ అడ్డంగా వ్రాప్ ను మనం చూడబోతున్నాం. ఎకో స్పోర్ట్ గా ఈ కారు మార్కెట్లోకి రాబోతుంది. ప్రస్తుతమున్నవెర్షన్ కూడా అదేమాదిరి మార్కెట్లోకి వచ్చింది. ఐదు సార్లు వరుసగా బెస్ట్ స్మాల్ ఇంజెన్ గా నిలిచిన ఫోర్డ్ ఈ వెర్షన్ లో కూడా ప్రస్తుతమున్న ఇంజన్ నే కొనసాగించనుంది. 1.0 లీటర్ మూడు సిలిండర్ల ఎకో బూస్ట్ ను కలిగిఉండనుంది. డిజీల్ పరంగా చూసుకుంటే ఫియస్టాను కొత్త 1.5 లీటర్ ఇంజన్ సామర్థ్యంతో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఈ వెహికిల్ ను భారత్ లో ప్రవేశపెడతారా..? అనేదే చర్చనీయాంశం. ఎప్పుడైతే ఆస్సైర్ కంపాక్ట్ సెడాన్ ను ఫోర్డ్ భారత మార్కెట్లోకి తీసుకొచ్చిందో అప్పటినుంచి ఫియాస్టా సెడాన్ లు ఇండియాలో విఫలమయ్యాయి. కానీ హ్యాచ్ బాక్ స్పేస్ లో దీన్ని ప్రవేశపెడతారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హ్యుందాయ్ ఐ20, ఫోక్స్ వాగన్ పోలో, హోండా జాజ్ వెహికిల్స్ కు పోటీగా దీన్ని తీసుకొస్తారని పేర్కొంటున్నారు. -
'ద్విచక్ర వాహనం నెంబరుతో దిరుగుతున్నకారు కోసం గాలింపు'
హైదరాబాద్: ద్విచక్ర వాహన నంబర్‌ను కారుకు ఏర్పాటు చేసుకొని తిరుగుతుండగా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కారు కోసం గాలింపు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. బాలకృష్ణారెడ్డి తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 2లో ఇటీవల ఏపీ 09 సీడీ 8460 ఫోర్డ్ ఫియస్టా కారును రాంగ్ రూట్లో వెళ్తుండగా గుర్తించారు. ఆపకుండా వెళ్తున్న ఈ కారును ఆన్లైన్ చలానా ద్వారా జరిమానా విధించేందుకు అడ్రస్ కోసం ఆరా తీశారు. అయితే ఈ నెంబర్‌పై ఎలాంటి కారు లేకపోగా హోండా యాక్టీవా స్కూటర్ మాత్రం ఉన్నట్లు గుర్తించారు. దొంగ నంబర్‌తో ఈ కారును నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు కారు కోసం గాలింపు చేపట్టారు. ఇది ఖచ్చితంగా దొంగిలించిన కారు అయి ఉంటుందని వెల్లడించారు. ఈ నంబర్‌తో ఉన్న హోండా యాక్టివా ఓ యువతికి చెందినదని పోలీసులు తెలిపారు.