విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు | Police, naxals exchange fire in visakha district | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు

May 27 2015 2:33 PM | Updated on Aug 21 2018 5:46 PM

విశాఖ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం జీడీపాలెంలో దగ్గర అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

విశాఖ : విశాఖ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం జీడీపాలెంలో దగ్గర అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

దాంతో పోలీసులు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు హోరాహోరీగా జరిగినట్లు సమాచారం. కాగా ఎదురు కాల్పుల్లో దళ కమాండర్ కుడుముల రవి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.  మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారంతో  కూంబింగ్ దళాలు అప్రమత్తం అయ్యాయి. మరోవైపు మావోయిస్టు అగ్రనేత తప్పించుకున్నట్లు వచ్చిన వార్తలను పోలీసు అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement