కలలు కనాలి.. నెరవేర్చుకోవాలి | Pilot Divya Visit Vasavya Vijayawada | Sakshi
Sakshi News home page

కలలు కనాలి.. నెరవేర్చుకోవాలి

Sep 6 2018 12:52 PM | Updated on Sep 6 2018 12:52 PM

Pilot Divya Visit Vasavya Vijayawada - Sakshi

చిన్నారులతో అన్నే దివ్య

పటమట (విజయవాడ తూర్పు): విద్యర్థులు తమ జీవితాశయం ఏమిటో చిన్ననాటి నుంచే కలలు కనాలని, వాటిని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయాలని మహిళా బోయింగ్‌ పైలెట్‌ అన్నే దివ్య పేర్కొన్నారు. బోయింగ్‌ 777 విమానానికి తొలి కమాండర్‌గా చరిత్ర సృష్టించిన అన్నే దివ్య బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న వాసవ్య మహిళా మండలిలో బుధవారం సందడి చేశారు. ఇక్కడ ఉంటున్న బాలికలతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులకు స్ఫూర్తి కలిగించేలా మాట్లాడారు. తాను మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయినేనని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, తపన, కృషి, పట్టుదల ఉన్నప్పుడు విజయం వరిస్తుందన్నారు. వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మీ, మహిళా మిత్ర సభ్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement