హోదా కోసం వ్యక్తి ఆత్మహత్య.. నేతల నివాళు.. | Person commits Suicide For Special Category Status In Vijayawada | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్య

May 31 2018 5:20 PM | Updated on Nov 6 2018 8:16 PM

Person commits Suicide For Special Category Status In Vijayawada - Sakshi

బెజవాడ శ్రీనివాసరావు

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా కోసం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 23న(మే) ఆరిగిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బెజవాడ శ్రీనివాసరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ రోజు నుంచి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు ఆయన మృతి చెందాడు. ఆయన మృతదేహానికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, యలమంచిలి రవి, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాసరావు తదితరులు నివాళు అర్పించారు. 

అతని కుటుంబానికి నేతలు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం సామాన్యులు బలి అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే ఆత్మహత్యలకు కారణమని పేర్కొన్నారు. ఇకనైనా హోదా విషయంలో కేంద్రం​ ముందుకు రావాలని నేతలు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement