వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు | Our Target is YS Jagan Mohan Reddy to become CM, says CK Babu | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు

Apr 10 2014 7:17 PM | Updated on Aug 14 2018 4:21 PM

వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు - Sakshi

వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు

మహాప్రస్థానం ముగింపు రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉంది అని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు.

చిత్తూరు: మహాప్రస్థానం ముగింపు రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉంది అని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. చిత్తూరులో సాక్షి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే మా ధ్యేయం సీకే బాబు అని అన్నారు.
 
వైఎస్ జగన్ నిరంతం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని  సీకే బాబు తెలిపారు. 
 
సీకే బాబుగా సుపరిచితులైన సీకే జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆతర్వాత 1994, 1999, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement