ఆప్షన్లు ఇచ్చింది సగం మందే | Options offered half belonged | Sakshi
Sakshi News home page

ఆప్షన్లు ఇచ్చింది సగం మందే

Sep 20 2014 3:06 AM | Updated on Sep 2 2017 1:39 PM

ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత పొందిన వారిలో సగం మందే వెబ్ కౌన్సెలిం గ్ లో పాల్గొన్నారు.

 హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత పొందిన వారిలో సగం మందే వెబ్ కౌన్సెలిం గ్ లో పాల్గొన్నారు. ప్రవేశపరీక్ష లో 97,640మంది అర్హత సా ధించగా, 50,030 మందే వెబ్ ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. రెండురాష్ట్రాల్లో  58వేల సీ ట్లుండగా, వాటిలో చేరేందు కు అభ్యర్థులే కరువయ్యారు.

ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న పీజీఈసెట్ అభ్యర్థులు.. తమ వెబ్‌ఆప్షన్లను మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కన్వీనర్ వే ణుగోపాల్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ రివైజ్డ్ షెడ్యూల్‌ను జ్ట్టిఞ://ఞజ్ఛఛ్ఛ్టి.్చఞటఛిజ్ఛి.్చఛి.జీ వెబ్‌సైట్లో ఉంచినట్టు కన్వీనర్ తెలిపారు.
 
రివైజ్డ్ షెడ్యూల్ ఇలా..

 
తేదీ    ర్యాంకులు
20    గేట్/జీప్యాట్(నమోదైన) ర్యాంకర్లు/  పీజీఈసెట్‌లో 1-1000 వరకు
21    1001-5000 వరకు
22    5001-1000 వరకు
23    10001 నుంచి చివరి వరకు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement