నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ అండతో స్థానిక పోలీసుల బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలపై
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ అండతో స్థానిక పోలీసుల బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పోలింగ్ ఏజెంట్లు న్యాయ పోరాటం ప్రారంభించారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేయకుండా, చట్ట విరుద్ధంగా అరెస్ట్‌లు చేయకుండా, ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా నంద్యాల పోలీసులను ఆదేశించాలని కోరుతూ పోలింగ్ ఏజెంట్లు ఎం.విజయశేఖర్‌రెడ్డి మరో 44 మంది సోమవారం హైకోర్టులో పిటిష న్ వేశారు.
ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎస్‌పీ, డీఎస్‌పీ, ఇతర పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది.