టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెంపుడు కుక్కలా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ రావు మండిపడ్డారు.
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ రావు మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా మందకృష్ణ వ్యాఖ్యానించడాన్ని సూర్య ప్రకాశ్ తూర్పరా బట్టారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు-మందకృష్ణ కలిసి ఆడుతున్న డ్రామాపై విరుచుపడ్డారు. మాదిగ ప్రయోజనాలను పక్కనబెట్టిన మందకృష్ణ చంద్రబాబుపై ప్రేమ కురిపించడానికి కారణమేమిటని ప్రశ్నించారు. బాబు ప్రయోజనాల కోసం మాత్రమే మందకృష్ణ పనిచేస్తున్నారని సూర్య ప్రకాశ్ విమర్శించారు.
వైఎస్‌ఆర్‌సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సమన్యాయం చేయలేనప్పుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కోరడాన్ని తప్పుబట్టిన మందకృష్ణ చంద్రబాబు పెంపుడు కుక్కలా వ్యవహరించడం సరికాదని నల్లా విమర్శించారు.